![](https://namastenri.net/wp-content/uploads/2024/11/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-32.jpg)
ఈ ఏడాది సెప్టెంబర్ 17, 18 తేదీల్లో లెబనాన్ వ్యాప్తంగా జరిగిన పేజర్ల పేలుళ్లకు తామే కారణమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తొలిసారిగా అంగీకరించారు. పేజర్ల పేలుడుకు ఇజ్రాయెలే కారణమని నెత న్యాహూ బహిరంగంగా అంగీకరించారు. అంతేకాకుండా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తామే హతమార్చా మని ఆయన చెప్పారు. హెజ్బొల్లాపై మిలిటరీ చర్యలను తమ రక్షణ శాఖలోనే కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారని ఆయన చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-32.jpg)