Namaste NRI

సంక్రాంతికి వచ్చాం … పెద్ద హిట్టు కొట్టాం : వెంకటేశ్‌

వెంకటేష్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన చిత్రం  సంక్రాంతికి వస్తున్నాం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.  ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. వెంకటేష్‌ మాట్లాడుతూ నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లో వారి నవ్వులు చూడటం గొప్ప అనుభూతినిస్తున్నది. ఈ సంక్రాంతికి మా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చేశారు. నా కెరీర్‌లో మరో అద్భుత విజయమిది అన్నారు.  సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఇవ్వాలనే సంకల్పంతోనే బరిలోకి దిగాం. విడుదలైన ప్రతి కేంద్రంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. దిల్‌ రాజు, శిరీష్‌ కెరీర్‌లో కూడా ఇదొక భారీ విజయంగా నిలవడం ఆనందంగా ఉంది అన్నారు.

అమెరికా నుంచి అమలాపురం వరకు షోలు పూర్తి కాగానే బ్లాక్‌బస్టర్‌ సంక్రాంతి హిట్‌ అనే రిపోర్ట్స్‌ వచ్చాయని, ప్రేక్షకు లు నాన్‌స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారని, థియేటర్లోనే ఈ సినిమాను చూసి ఆస్వాదించాలని నిర్మాత దిల్‌ రాజు చెప్పారు. ఉదయం నాలుగున్నర షోలకు ఫ్యామిలీ ఆడియన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉందని, భారీ ఓపెనింగ్స్‌ లభించాయని, ఇట్స్‌ ఏ బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌ హిట్‌ అని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్‌, కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events