అణ్వాయుధాల వాడకం విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఏ సమయంలో ఎప్పుడు, ఎందుకు అణ్వాయుధం వాడుతామో ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అణ్వాయుధ రహిత దేశం నుంచి తమపై దాడి జరిగితే, ఆ దాడికి అణ్వాయుధ దేశం మద్దతు ఇస్తే, దాన్ని సంయుక్త దాడిగా పరిగణిస్తామని, ఆ సందర్భంలో తాము అణ్వాయుధాన్ని వాడనున్నట్లు పుతిన్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-86.jpg)
ఉక్రెయిన్ అణ్వాయుధ రహిత దేశమని, ఒకవేళ ఆ దేశం కనుక అణు దాడిలో పాల్గొంటే, దానిపై న్యూక్లియర్ వెపన్ ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. పశ్చిమ దేశాలు అందిస్తున్న లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ఒకవేళ ఉక్రెయిన్ వాడితే, అప్పుడు ఆ దేశంపై అణు బాంబుతో దాడి చేసే అవకాశాలు ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/09/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-87.jpg)