మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని, హింసతో ఏమీ సాధించలేరని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలజడులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుందని ధ్వజమెత్తారు. దాడుల సంస్కృతి మంచిది కాదని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోని ప్రజా జీవితంలోకి తిరిగి క్షేమంగా రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాక ఇలా హత్య రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా హింసే, పదవుల కోసం హత్యా రాజకీయాలు, కాంగ్రెస్ అంటేనే కల్లోలం, అరాచకం, నెత్తుటి రాజకీయం. వీళ్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ సర్వనాశనం. గాంధీ భవన్‌లోకి గాడ్సే వచ్చాక ప్రశాంత తెలంగాణలో చిచ్చు రగులుకుంది. నెత్తుటి రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొడదాం. మన తెలంగాణను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.