
అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి తన సొంత రాష్ట్రమైన ఓహియో గవర్నర్గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తన ప్రచారాన్ని సిన్సినాటిలో ప్రారంభించి, తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక రామస్వామి ప్రచారానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాజకీయ సలహాదారులు మార్గనిర్దేశం చేయనున్నారు. ఒహియో అటార్నీ జనరల్ దవే యోస్ట్ కూడా ఈ పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని జనవరిలోనే ప్రకటించారు. అపలాచియాకు చెందిన నల్లజాతి పారిశ్రామికవేత్త హీథర్ హిల్, వైద్య విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎమీ ఏక్షన్ (డెమోక్రాట్) గవర్నర్ పదవి బరిలో దిగుతున్నారు. కాగా, గతేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే.
