Skip to main content

Namaste NRI

అందరికి కనెక్ట్‌ అయ్యే హార్ట్‌టచింగ్‌ లవ్‌స్టోరీ : సుప్రియ యార్లగడ్డ

అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం డెకాయిట్‌.మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. షానియల్‌ డియో దర్శకత్వం. ఈ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.ఇటీవలే షూటింగ్‌ పూర్తయింది. ఈ సందర్భంగా షూట్‌ర్యాప్‌ పేరుతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అడివి శేష్‌ మాట్లాడుతూ యాక్షన్‌ కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ఈ మధ్యకాలంలో లవ్‌స్టోరీస్‌ తగ్గిపోయాయి. కథకు అవసరం ఉందనుకుంటే నేను ఏదైనా చేస్తాను. ఓ కొత్త జోనర్‌లో చేసిన ప్రయోగాత్మక చిత్రంగా అందరిని అలరిస్తుంది అన్నారు. విడిపోయిన మాజీ ప్రేమికులు వారి ప్రయాణంలో ఏ సత్యాన్ని తెలుసుకున్నారన్నది ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశమని, కథలో రాబరీ ఓ భాగంగా ఉంటుందని, అందుకే డెకాయిట్‌ అనే టైటిల్‌ పెట్టామన్నారు.

ఇలాంటి బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీలో భాగం కావడం ఆనందంగా ఉందని అనురాగ్‌కశ్యప్‌ అన్నారు. ఇదొక లాంగ్‌జర్నీ అని, అందరికి కనెక్ట్‌ అయ్యే హార్ట్‌టచింగ్‌ లవ్‌స్టోరీగా మెప్పిస్తుందని నిర్మాత సుప్రియ యార్లగడ్డ పేర్కొన్నారు. ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News