జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా ఐదు నెలల పాటు వాయి దాపడిన బల్దియాలోని అనేక అంశాలు వెంటనే ముందుకు తీసుకెళ్లేలా, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. జీహెచ్ఎంసీ బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయాల న్నారు. దీంతో పాటు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, బల్దియా సర్వ సభ్య సమావేశం నిర్వహణపైనా కమిషనర్ రోనాల్డ్ రాస్కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిపాలన సజావుగా సాగడంతో పాటు రాష్ట్ర రాజధానికి అత్యంత కీలకమైన బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు మార్గం సుగమం అయ్యేలా సర్వ సభ్య సమావేశాన్ని నేరుగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని మేయర్ కోరారు.