Skip to main content

Namaste NRI

దుబాయ్‌ ఎయిర్‌పోర్టు మూసివేత

ఇరాన్‌ తో ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడులను తీవ్రతరం చేసింది. తన పొరుగుదేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్‌ దాడులు చేసింది.ఈ సందర్భంగా ఒక డ్రోన్‌ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దాంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయాన్ని మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీస్‌ జారీచేశారు. విమానాల స్టేటస్‌ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచన చేశారు.

అంతేగాక పలు విమానాలను అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ఇంధన ట్యాంక్‌కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంధన ట్యాంక్‌పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events