Skip to main content

Namaste NRI

ఘనంగా టీఎఫ్ సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్‌

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) నిర్వహించిన టీఎఫ్‌సీసీ షార్ట్‌ ఫిలిం అవార్డ్స్‌ 2026 ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యూరీ ఛైర్మన్‌, నటి ఇంద్రజ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. శ్రీనుగాడి సైకిల్‌ స్టోరీ, సైబర్‌ స్లేవరీ, మాతృదేవోభవ షార్ట్‌ ఫిల్మ్‌లు వరుసగా ఉత్తమ, ద్వితీయ, తృతీయ చిత్రాలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్లయిన సందర్భంగా ఈ అవార్డులను అందజేశామని అన్నారు. కేవలం 15రోజుల వ్యవధిలోనే ఈ కాంటెస్ట్‌ను విజయవంతంగా నిర్వహించామని, 60కిపైగా ఎంట్రీలు వచ్చాయని, విజేతలకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది మరింత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, నగదు బహుమతుల్ని కూడా పెంచుతున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పేర్కొన్నారు.

కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే గొప్ప లక్ష్యంతో ఆర్‌.కె.గౌడ్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అద్భుతమైన స్పందన లభించిందని జ్యూరీ ఛైర్మన్‌ ఇంద్రజ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌సీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ గురురాజ్‌, ఫైట్‌ మాస్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events