Namaste NRI

చూడకయ్యో.. నెమలికళ్ళ పాటను విడుదల చేసిన చంద్రబోస్‌

సదన్‌, ప్రియాంకప్రసాద్‌ జంటగా నటిస్తున్న చిత్రం ప్రణయ గోదారి. పీఎల్‌ విఘ్నేష్‌ దర్శకత్వం.  ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్‌ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమా నుంచి చూడకయ్యో..నెమలి కళ్ల తూగుతున్న తూనీగల్లా అనే పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ పాటకు చక్కటి సాహిత్యం కుదిరిందని, బాణీ ఆకట్టుకునేలా ఉందని, జానపద శైలితో అందరినీ మెప్పిస్తుందని అన్నారు. మార్కండేయ రచించిన ఈ గీతాన్ని సాయిచరణ్‌, సునీత ఆలపించారు. సాయికుమార్‌, పృథ్వీ, జబర్దస్త్‌ రాజమౌళి నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్‌, సంగీతం: మార్కండేయ, దర్శకత్వం: పీఎల్‌ విఘ్నేష్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress