జర్మనీలో ఫ్రాంక్‌ఫర్డ్‌లో ఎన్టీఆర్ శతజయంతి, మినీ మహానాడు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. టీడీపీ` జర్మనీ ఆధ్వర్యంలో 2018 నుంచి మహానాడు నిర్వహించగా, మే 29న ఐదోసారి మినీ మహానాడు జరిగింది. మహానాడును ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న తిరునగరి వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జగన్ అరాచక పాలనను కొనసాగుతుందని విమర్శించారు. జర్మనీ టీడీపీ కోర్‌కమిటీ సభ్యులు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విదేశీ విద్య పథకం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగాలు పొందిన విషయూన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, పవన్ కుర్రా, శివ, సుమంత్ కొర్రపాటి, అనిల్ మిక్కలినేని, టిట్టు మద్దిపట్ల, నరేశ్ కోనేరు, వంశీకృష్ణ దాసరి, వెంకట్ కాండ్ర, టీడీపీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
