Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. కౌంటర్ టెర్రరిజం చీఫ్ రాజీనామా

ఇరాన్‌తో యుద్ధం సాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో అమెరికా కౌంటర్ టెర్రరిజం చీఫ్‌గా ఉన్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్‌పై జరుగుతున్న ఈ యుద్ధాన్ని తాను సమర్ధించడం లేదని, ఇందుకు తన అంతరాత్మ ఒప్పుకోదని జో కెంట్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఇరాన్‌ నుంచి అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల అమెరికాకు ఈ యుద్ధం అవసరం లేదన్నాడు.

అయితే, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి దిగిందని కెంట్ స్పష్టం చేశారు. అమెరికాకు ఇజ్రాయెల్ అతిపెద్ద లాబీయింగ్ చేసే దేశమన్నారు. అయితే, విదేశాలకు సంబంధించి ఇప్పటివరకు ట్రంప్ అనుసరించిన విధానాల్ని తాను సమర్ధి కెంట్ తెలిపారు.

Social Share Spread Message

Latest News