అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజులకే డొనాల్డ్ ట్రంప్, ఇతర దేశాలపై బల ప్రదర్శనకు దిగుతున్నారు. గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌పై ట్రంప్ బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిసింది. డెన్మార్క్‌ను సుంకాలతో శిక్షిస్తానని ట్రంప్ ఫోన్‌కాల్‌లో హెచ్చరించినట్టు తెలిసింది. ఇటీవల వీరిద్దరి మధ్య 45 నిమిషాలపాటు సాగిన ఫోన్ కాల్ సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్ తన అభిప్రాయాలను ఘాటైన స్వరంతో వినిపించారని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ మాటల్ని డెన్మార్క్ ప్రధాని తోసిపుచ్చటంతో, ట్రంప్ మాటల ధోరణి వేరే విధంగా మారిందని, ఒక దశలో బెదిరింపులకు పాల్పడ్డారని ఆ అధికారులు పేర్కొన్నారు. ఇద్దరి మధ్యా వాగ్వాదం కూడా చోటుచేసుకుందని, గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో తాము సీరియస్‌గా ఉన్నామని ట్రంప్ చెప్పినట్టు సమాచారం.అయితే దానిని అమ్మడంపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని డెన్మార్క్ ప్రధాని సమాధానమిచ్చారట. ఫోన్‌కాల్‌లో ట్రంప్ సంభాషించిన తీరుకు తాము దిగ్భ్రాంతికి గురయ్యామని అధికారులు వెల్లడించారు. డెన్మార్క్ తిరస్కరణతో అమెరికా నుంచి ప్రతీకార చర్యలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.