Skip to main content

Namaste NRI

విదేశీ విద్యార్థులకు కెనడా షాక్‌ !

కెనడా వరుసగా రెండో ఏడాదీ అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే పర్మిట్ల సంఖ్యను తగ్గించనుంది. గృహ, ఆరోగ్యం, ఇతర సేవలు అందించడంలో పాలకులు రాజకీయంగా, ప్రజా బాహుళ్యం నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో దాని నుంచి బయటపడటానికి ఈ చర్య చేపట్టినట్టు  సమాచారం. ఈ ఏడాది 4,37,000 అంతర్జాతీయ విద్యార్థి పర్మిట్లను జారీ చేయాలని ఆ దేశ వలస శాఖ నిర్ణయించింది.

2024తో పోలిస్తే ఇది 10 శాతం తక్కువ. జనాభా సంఖ్య పెరిగిపోవడంతో కెనడాలో ఇండ్ల లభ్యత సమస్య తీవ్రమైంది. 2023లో ఆ దేశం పరిమితికి మించి 6,50,000 విద్యార్థి పర్మిట్లను జారీ చేసింది. దీంతో మౌలిక సదుపాయాలు, ప్రజా సేవలపై ప్రభావం పడి, దేశ ప్రజల నుంచి ప్రతికూలత రావడంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడో విద్యార్థుల పర్మిట్ల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. విద్యార్థుల పర్మిట్ల జారీకి సంబంధించి నిబంధనలను కూడా కఠినతరం చేశారు.

Social Share Spread Message

Latest News