

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వై వార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో జరగనున్నది. ఈ మహాసభలను పురస్కరించుకుని డిట్రాయిట్‌లో వివిధ ఆటల పోటీలను తానా కాన్ఫరెన్స్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా త్రోబాల్, వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 500మందికిపైగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభతో పలువురిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా డెట్రాయిట్ డ్రాగన్స్, డ్రేక్ చీతాస్, క్లీవ్‌ల్యాండ్ సెట్టర్స్, ఫార్మింగ్టన్ ఫైటర్స్ విజేతలుగా నిలిచారు.


పోటీల్లో భాగంగా నిర్వహించిన మెయిన్ విభాగంలో విజేతలుగా డెట్రాయిట్ డ్రాగన్స్, రన్నరప్స్‌గా డెట్రాయిట్ ఛాంప్స్ నిలిచారు. తుషార, మోనీని వ్యక్తిగత క్రీడాకారులుగా ప్రకటించారు. బిగినర్స్ విభాగంలో విజేతలుగా డ్రేక్ చీతాస్, ఇంటర్మీడియట్ విభాగంలో విజేతలుగా క్లీవ్‌ల్యాండ్ సెట్టర్స్, రన్నరప్ గా కూలీ పదై, అడ్వాన్స్‌డ్ విభాగంలో విజేతలుగా ఫార్మింగ్టన్ ఫైటర్స్, రన్నరప్స్: నైట్‌ఫ్యూరీస్ నిలిచింది. వ్యక్తిగత ప్రశంసలు టోనీ, శ్రీకాంత్ లకు లభించింది.


ఈ సందర్భంగా విజేతలకు కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ చాపలమడుగు, డైరెక్టర్ సునీల్ పంట్ర, సెక్రటరీ కిరణ్ దుగ్గిరాల తదితరులు బహుమతులను అందించారు. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఈ టోర్నమెంట్ నిర్వహణలో పాలుపంచుకుంది. ఈ టోర్నీలో పాల్గొని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

