Skip to main content

Namaste NRI

తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో వేసవి వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒక చోట చేరి వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఇంటి వద్ద నుండి తెచ్చిన వంటకాలను అందరికీ పంచుకున్నారు. హైదరాబాద్ వంటకాల విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆట పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీసీఏ సౌత్ బే ప్రతినిధి ఆంజనేయులు, పి. గోపి కృష్ణ, జి శ్రీధర్, సౌత్ బే వాలంటీర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టీసీఏ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ధనంజయ్ బి, శ్రీనివాస్ జి, మహిపాల్ ఏ, వినయ్ ఎం, సాగర్ కె, గోపి కృష్ణ జి, ఆంజనేయులు పి, శ్రీధర్ జి, విజయ్ సి, అడ్డజరీ కమిటీ సభ్యులు వాలంటీర్స్ ను అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన స్పాన్సర్లకు , ఇతర దాతలకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ వేడుకల్లో పాల్గొని మద్దతు తెలిపిన ఏఐఏ, క్యూ పర్టీనో సిటీ కౌన్సిల్, amana, పాఠశాల వంటి ఇతర కమ్యూనిటీ సంస్థలకు కూడా టీసీఏ ధన్యవాదాలు తెలిపింది.

Social Share Spread Message

Latest News