
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు. జ్యూరిక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు తెలుగు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పూలు, జాతీయ జెండాలతో పాటు ఆత్మీయ వాతావరణంలో మంత్రి లోకేష్‌ను వారు ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు లోకేశ్ అక్కడి నుంచి దావోస్‌కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ని నమ్మకమైన గ్లోబల్ గమ్యంగా నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ అన్నారు. 90వ దశకంలోనే భారత్‌కు తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరని పేర్కొన్నారు.















