Namaste NRI

మెలానియా ట్రంప్ కండిషన్…ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అయితే

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైతే తాను దేశ ప్రధమ పౌరురాలిగా ఉండనని మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్‌నకు ఆయన భార్య మెలానియా ట్రంప్ పెట్టిన కండిషన్ సంచలనం అయింది. ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ అయితే మెలానియా దేశానికి ఫస్ట్‌లేడీ కావాల్సి ఉంటుంది. ఇది శ్వేతసౌధం ద్వారా ఖరారైన విధివిధానం . అయితే తాను కుమారుడు బరాన్ ట్రంప్ కోసం మరింత సమయం కేటాయించాల్సి ఉంటుం దని, ఆయన నేత అయితే సంతోషమే కానీ తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందని కూడా మిలానియా తెలిపారు.

 ఓ వైపు ట్రంప్ తన ప్రచారంలో దూకుడు పెంచుతున్న దశలోనే ఆమె ఆయనతో సంబంధిత విషయంలో డీల్ కుదుర్చుకుందని, ప్రచారంలో కూడా ఆమె పాల్గొనబోదని  వెలువడింది. ప్రెసిడెంట్ భార్యను అయితే విధిగా ఫస్ట్‌లేడీగా 24/7 డ్యూటీలో ఉండాల్సిందే , ఇది తనకు కుదరదని మెలానియా తేల్చివేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress