సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రైటర్ పద్మభూషణ్. సుహాస్కు జోడీగా టీనా శిల్పరాజ్ నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు శణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేసింది. లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అనగనగా మన విజయవాడ మహా నగరంలో నెలబడ్జెట్లో వెయ్యి రూపాయలు మిగిలిన పొంగిపోయే నాన్న, సీరియల్స్లో ట్విస్ట్లు ముందే కనిపెట్టే అమ్మ, రాబోయే కాలంలో కాబోయే గొప్ప రైటర్ను అని ఫీలయ్యే నేను అంటూ సుహాస్ పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. రైటర్ కావాలనుకున్న సుహాస్ కల కలగానే మిగిలిపోతుందా? సుహాస్ లైఫ్లో వచ్చే ట్విస్ట్ ఏంటి? సుహాస్ గర్ల్ఫ్రెండ్ తనను ఛీ కొట్టడానికి రీజన్ ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు ట్రైలర్లో కనిపిస్తున్నాయి. ఆశీష్ విద్యార్థి, రోహిణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్స్ట్ సంస్థ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.