వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించ గా ఇమ్మాన్యుయేల్ అంగీకరించారు. రిపబ్లిక్ వేడుకలను మీతో కలిసి జరుపుకుంటానని మాక్రాన్ పేర్కొన్నారు. మీ ఆహ్వానానికి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఆరో ఫ్రెంచ్ నాయకుడు మాక్రాన్. కాగా, గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తోన్న విషయం తెలిసిందే.