Namaste NRI

వారెంత విధిస్తే,  మేమూ అంతే వసూలు చేస్తాం  

అమెరికా వస్తువులపై భారత్‌ విధించే సుంకాల పై యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తాజాగా స్పందించారు. గతంలో ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్‌ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని,  అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు మాత్రం తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాలను న్యూ ఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

ఈ మేరకు ట్రంప్‌ మాట్లాడుతూ నాకు భారత్‌తో మంచి సంబంధం ఉంది. కానీ ఏకైక సమస్య ఏంటంటే,  ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. కానీ, ఏప్రిల్‌ 2 నుంచి వారెంత విధిస్తే,  మేమూ అంతే వసూలు చేస్తాం  అని ట్రంప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events