Skip to main content

Namaste NRI

దేవాలయాల భద్రత కోసం రూ.100 కోట్లు :ట్రంప్‌

అమెరికాలోని ఇల్లినాయిస్‌లో హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కుట్ర వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, దీపావళికి ముందుగా అమెరికాలోని హిందూ దేవాలయాలు, మతపరమైన సంస్థల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 500 దేవాలయాల భద్రత కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

ఈ భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆలయ ప్రాంగణాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, నిఘా అలారంలను సమకూర్చనున్నారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు వచ్చే దేవాలయాల వద్ద శిక్షణ పొందిన, లైసెన్సులు కలిగిన సాయుధ గార్డులను నియమించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events