Namaste NRI

ఆమె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాల‌ర్లు: ఎఫ్‌బీఐ

అమెరికాలో భార‌తీయ మ‌హిళ నాలుగేళ్ల నుంచి అదృశ్య‌మైంది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు ఎఫ్‌బీఐ ప్ర‌క‌టించింది. 29 ఏళ్ల మ‌యూషీ భ‌గ‌త్‌, న్యూజెర్సీలో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లి అదృశ్య‌మైంది. 2019, ఏప్రిల్ 29వ తేదీన ఆమె క‌నిపించ‌కుండాపోయింది. ఆమె ఇంటి నుంచి వెళ్లిన‌ప్పుడు క‌ల‌ర్ పైజామా, బ్లాక్ టీ ష‌ర్ట్ ధ‌రించింది. మ‌యూషీ మిస్సింగ్ పై ఆమె కుటుంబ‌స‌భ్యులు మే 1వ తేదీనే ఫిర్యాదు చేశారు. మ‌యూషీ భ‌గ‌త్ మిస్సింగ్ గురించి ఎఫ్‌బీఐ నివార్క్ ఫీల్డ్ ఆఫీస్‌, జెర్సీ సిటీ పోలీసు శాఖ ఆమె కోసం వెతుకుతూనే ఉన్న‌ది. అయితే ఆమె లొకేష‌న్‌ను ఇంకా గుర్తించ‌క‌పోవ‌డంతో ఎఫ్‌బీఐ రివార్డు ప్ర‌క‌టించింది. ఆమె స‌మాచారం ఇచ్చిన వాళ్ల‌కు ప‌దివేల డాల‌ర్లు ఇవ్వ‌నున్న‌ట్లు ఎఫ్‌బీఐ తెలిపింది.

1994లో వ‌డోద‌రాలో మ‌యూషీ జ‌న్మించారు. స్టూడెంట్ వీసాపై ఆమె అమెరికా వెళ్లింది. న్యూయార్క్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఆమె చ‌దువుతోంది. ఇంగ్లీష్‌, హిందీ, ఉర్దూ భాష‌ల‌ను మాట్లాడ‌గ‌ల‌ద‌ని ఎఫ్‌బీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events