Skip to main content

Namaste NRI

బ్రిటన్‌లో 12 మంది భారతీయుల అరెస్ట్‌

బ్రిటన్‌లోని పరుపులు, కేక్‌ పరిశ్రమల్లో అక్రమంగా పనిచేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వెస్ట్‌ మిడ్‌ల్యాండ్స్‌ ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో వీరిని అరెస్ట్‌ చేసినట్టు యూకే హోం శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. కేక్‌ ఫ్యాక్టరీలో అరెస్టయిన నలుగురు భారతీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించారు. మొత్తం నిందితుల్లో నలుగురిని దేశం నుంచి బహిష్కరించడమా లేదా ఇండియాకు తిప్పి పంపడమా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మిగతా 8 మందికి క్రమం తప్పకుండా హోం శాఖ ఆఫీసులో రిపోర్ట్‌ చేయాలనే నిబంధన మీద బెయిల్‌ ఇచ్చాం అని హోం శాఖ తెలిపింది.

భారతీయులతో అక్రమంగా పని చేయించుకుంటున్న ఫ్యాక్టరీలకు జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు. చట్ట విరుద్ధంగా పని చేయడం స్థానిక సమాజాలకు హాని కలిగిస్తుందని,  తాజా అరెస్టులు ఫ్యాక్టరీ యజమానులకు హెచ్చరికలు పంపుతాయని అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులను అరికట్టాలని సునాక్‌ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో విదేశీయులకు వీసా నిబంధనలు సైతం కఠినతరం చేశారు.

Social Share Spread Message

Latest News