గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది. భూమిపై 1,25,000 సంవత్సరాల్లో అత్యంత వేడి సంవత్సరంగా 2023 నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందునాటి కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్లాలన్నది పారిస్ ఒప్పంద లక్ష్యం. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. అయితే ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా 2023లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ కోపర్నికస్ లెక్కతేల్చింది. 1.5 డిగ్రీల సెల్సియస్, 2024 జనవరిలో దాటుతుందని అంచనావేసింది. కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్జెస్ మాట్లాడుతూ రాబోయే 2-3 దశాబ్దాల్లో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపే ఉండాలి. లేదంటే ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై పడుతుందని హెచ్చరించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)