Namaste NRI

ఒమన్‌లో 13 మంది భారతీయుల గల్లంతు

ఒమన్‌ తీరంలో చమురు ట్యాంకర్లతో ప్రయాణిస్తున్న ప్రెస్టీజ్‌ ఫాల్కన్‌ అనే ఓడ బోల్తా పడింది. ఈ ఓడలో ఉన్న 16 మంది సిబ్బంది గల్లంతయ్యారని ఒమన్‌ మారిటైమ్‌ సెక్యూరిటీ సెంటర్‌(ఎంఎస్‌సీ) తెలిపింది. ఇందులో 13 మంది భారతీయులు కాగా, మరో ముగ్గురు శ్రీలంకకు చెందిన వారుగా గుర్తించారు. వీరి ఆచూకీ కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. కొమొరోస్‌కు చెందిన ఈ ఓడ యెమన్‌లోని ఓడరేవు నగరమైన ఏడెన్‌కు వెళ్తున్నట్టు తెలిసింది. రాయ్‌ మద్రకహ్‌కు ఆగ్నేయం వైపు 25 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఓడ బోల్తా పడటానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఓడ ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events