Namaste NRI

18 పేజెస్ సక్సెస్ మీట్  

నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా 18 పేజెస్. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది.  నిఖిల్ మాట్లాడుతూ సినిమా రిలీజై వారం రోజులు అవుతుంది, నేను న్యూస్ పేపర్స్ బుక్ మై షో చూస్తుంటే మొదటిరోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో అంతకుమించిన థియేటర్స్ ఉన్నాయ్. కొన్ని చోట్ల, ఇది ఒక బిగ్ అచీవ్‌మెంట్‌. 18 పేజెస్ సినిమా ఒక స్లో పాయిజన్ అండి. 2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో 18 పేజెస్ ఉంటుంది. ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో అనుకున్నాను, కానీ నిజంగా ఈరోజు సప్రైజ్ అవుతున్నాను. అనుపమ మాట్లాడుతూ కొన్ని సినిమాలు చేసినప్పుడు మనకు కిక్ వస్తుంది. కానీ 18 పేజెస్ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నాకు సంతృప్తినిచ్చింది. ఒక యాక్టర్ గా చాలా మంచి సినిమా చేసిన ఫీల్ వచ్చింది. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ 18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది.  తెలుగు ఆడియన్స్ కి కృతజ్ఞతలు, మీరెప్పుడు మంచి సినిమాలను ఆదరిస్తారు. దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు క్యూట్ లవ్ స్టోరీ గా తీద్దామనుకున్నాం. ఈ సినిమాను అరవింద్ గారికి, బన్నీవాసు గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమి ఫీల్ అయ్యారో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాకు మేమే ప్రేమలో పడిన ఫీల్ వస్తుందండి అంటున్నారు. అది మాకు పెద్ద అప్రిసెషన్. ఈ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.ఈ సినిమాను చూసి ఆదరించిన ఆడియన్స్ కి చాలా చాలా థాంక్స్ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమాను దర్శకుడు కూడా ఆసక్తికరంగా మలిచాడు. నిఖిల్ ఇంకో రెండు సినిమాలు మా బ్యానర్ లో చేయమని అడిగాం, దానికి తాను ఇంకా ఒప్పుకోలేదు, పార్టనర్ అయిపోమని సలహా ఇచ్చాను, ఆ పనిమీద ప్రస్తుతం బన్నీవాసు ఉన్నాడు (నవ్వుతూ). థాంక్యూ మీడియా మీరు మాకు, ప్రేక్షకులకు సంధానకర్తగా ఉన్నారు. మీరు లేకపోతే ఇది సాధ్యం కాదు అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events