గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 1996 ధర్మపురి. శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి దర్శకుడు మారుతి, నిర్మాతలు వై.రవి శంకర్, యస్.కె.యన్, సెవెన్ హిల్స్ సతీష్, రచయిత డార్లింగ్ స్వామి, నటుడు జీవీ అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది అన్నారు. మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి, గీతా ఆర్ట్స్ వారికి థ్యాంక్స్ అన్నారు చిత్ర నిర్మాత భాస్కర్. 1996 ధర్మపురి చాలా బాగా వచ్చింది అన్నారు జగత్. చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి, నా ప్రతిభని బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు గగన్. ఈ సినిమాకి సంగీతం : ఓషో వెంకట్, ఛాయాగ్రహణం: కృష్ణ ప్రసాద్. ఈ కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, దర్శకుడు మారుతి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.














