గత 8 ఏళ్లలో 2.4 లక్షల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారని ప్రభుత్వం చెబుతోంది. రాజ్యసభ లో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం 2014 నుంచి 2022 వరకు ఎనిమిదేళ్లలో 2,46,580 మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చేశారు. ఢిల్లీ నుంచి అత్యధికంగా 60,414 మంది, ఆ తర్వాతి స్థానంలో పంజాబ్ 28,117 మంది, గుజరాత్ 22,300 మంది, గోవా 18,610 మంది, కేరళ 16,247 మంది తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయడం గమనార్హం.
రాజ్యసభలో రాష్ట్రాలవారీగా పాస్‌పోర్టుల సరెండర్‌పై తలెత్తిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ సమాధానం ఇచ్చారు. మొత్తంగా గడిచిన ఎనిమిది ఏళ్లలో 2,46,580 మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2019-22 మధ్య 35 దేశాల్లోని 24వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను తిరిగి ఇచ్చివేసినట్లు ఆయన తెలిపారు.