Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి తెలియజేశారు.

నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.