Skip to main content

Namaste NRI

అమెరికా, భారత్ మధ్య ఆయన కీలక పాత్ర కీలకం

అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో బిపిన్‌ రావత్‌ పాత్ర కీలకమని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ ఫ్రైస్‌ అన్నారు. భారత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల అమెరికా సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా నెడ్‌ ప్రైస్‌ మీడియాతో మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించేందుకు ఆయన దోహదపడ్డారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ కుటుంబానికి, ఈ ప్రమాదంలో మృతి చెందిన సైనిక సిబ్బంది కుటుంబాలకి, భారతీయులందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని అన్నారు.

Social Share Spread Message

Latest News