ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కోట శ్రీనివాసరావు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం జరిగింది. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో వారు ఎనలేని కృషి చేసారు.వారు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండిరగ్ సమస్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్ నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా ముఖ్యమంత్రి అందించారు.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా.. అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సినీనటుడు మోహన్ బాబు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు.