Skip to main content

Namaste NRI

ఎమ్మెల్సీ కవితను కలిసిన ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఎన్నారై కో ఆర్డినేటర్‌, పీవీ కమిటి సభ్యులు మహేష్‌ బిగాల మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్‌ బిగాల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో వివిధ దేశాలలో కరోనా పరిస్థితిని వివరించి, ఆయా దేశాల్లో తెలంగాణ వాసుల యోగక్షేమాలు తెలియజేశారు. అలాగే పీవీ శత జయంతి ఉత్సవాల విగ్రహ ప్రతిష్టాపన గురించి వివిధ దేశాలలో నిర్వహించే ప్రక్రియ గురించి కూడా ఆయన తెలియజేశారు.

                        అమెరికా పర్యటన ముగించుకున్న మహేష్‌ బిగాల అక్కడ వివరాలను తెలియజేశారు. అమెరికాలోని అట్లాంటా రాష్ట్రంలో ఈ ఏడాది మే 22న జరగనున్న దివంగత మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు విగ్రహావిష్కరణకు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. కాగా ఈ ఆహ్వానంపై ఎమ్మెల్యే కవిత సానుకూలంగా స్పందించారు.

Social Share Spread Message

Latest News