Namaste NRI

న్యూఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు. గంటపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం, రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు అంశాలపై చొరవ చూపాలని కోరుతూ సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రధానికి వినతిపత్రం అందించారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని మంత్రి శ్రీ హరీశ్ రావును, వైద్యాధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్ట్ నుండి భోగాపురానికి 6 లైన్లతో జాతీయ రహదారి ఎంతో ప్రయోజనకరం అని, దాని నిర్మాణానికి చొరవ చూపాలని సీఎం శ్రీ వైయస్ జగన్ కేంద్రమంత్రిని కోరారు. విజయవాడ తూర్పు బైపాస్, NH-216కి సంబంధించి బాపట్లలో 4 లైన్ల రోడ్డు విస్తరణ కోసం సీఎం విజ్ఞప్తి చేశారు.

లోక కళ్యాణార్ధం ప్రతియేటా సంక్రాంతి పండుగ వారంలో మన మిన్నెసోటా తెలుగు సంఘం ఘనంగా నిర్వహించు శ్రీనివాస కల్యాణ వేడుకలకు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేయాలని అందరికి ఇదే మా సాదర ఆహ్వానం. కల్యాణ కార్యక్రమములో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదములను స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుని కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము.