Namaste NRI

అమెరికా కీలక నిర్ణయం… 12 నుంచి 15 ఏళ్ల వారికి

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌ అందించేందుకు అనుమతించింది. రెండు డోసుల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవడానికి మధ్య కనీసం 5 నెలల గ్యాప్‌ ఉండాలని చెప్పింది. ఇంతకుముందు ఇది ఆరు నెలలుగా ఉండేది. ఈ నిడివిని తగ్గిస్తూ తాజాగా యూఎస్‌ సీడీసీ నిర్ణయం తీసుకున్నాయి. బూస్టర్‌ డోసు తీసుకుంటే ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని యూకే, సౌతాఫ్రికాల్లోని డేటా చెప్తోందని సీడీసీ తెలిపింది.

Social Share Spread Message

Latest News