Namaste NRI

ఉగాది ప‌ర్వ‌దినాన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త సౌంద‌ర‌రాజ‌న్‌తో క‌లిసి స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆల‌య అర్చ‌కులు ప్ర‌త్యేక ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు.

ప్రగతి భవన్‌లో శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు.