Skip to main content

Namaste NRI

ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రగతి భవన్‌లో శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. వేదపండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేదాశీర్వచనం అందించారు. బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. తెలంగాణకు ఈ ఏడాది 75 శాతం మంచి జరుగుతుందని పంచాంగ పఠనంలో చెప్పారు. తెలంగాణలో వర్షాలు పడతాయని, పంటలు బగా పండుతాయని తెలిపారు. ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం అని పంచాంగం కూడా చెబుతుందని బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. పాలన పరంగా అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆయన పంచాంగ పఠనంలో చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News