వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్య రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు సీజేకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.