
భూమిపై జీవం పుట్టుకకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సుమారుగా 420 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిందని సైంటిస్టులు అంచనావేస్తున్నారు. సైన్స్ అలర్ట్ జర్నల్ నివేదిక ప్రకారం, భూమిపై ప్రస్తుత జీవుల జన్యువులను విశ్లేషించిన సైంటిస్టులు, పూర్వీకుల్లో చివరన ఉన్న జీవుల పుట్టుక సమయాన్ని గణించారని నివేదిక పేర్కొన్నది. జన్యు క్రమంలో చివరి సార్వత్రిక సాధార ణ పూర్వీకుల సమయాన్ని వారు కనుగొన్నారు. భూమిపై జీవం పుట్టుకకు ఒకే ఒక పూర్వీకుడు కారణమైతే, ఆ పూర్వీకుడు సుమారుగా 420 కోట్ల క్రితం పుట్టి ఉంటాడని అంచనా కట్టారు. భూమి ఏర్పడి కూడా 450 కోట్ల సంవత్సరాలు అవుతున్నది. తాజా పరిశోధన ప్రకారం.. భూమి శైశవ దశలోనే జీవం ఏర్పడినట్టు అధ్యయనం సూచిస్తున్నది.
