Skip to main content

Namaste NRI

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఖమేని మృతి..ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక

అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన భీకర దాడులకు పాల్పడ్డాయి, ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయాతుల్లా అలీ ఖమేని(86) ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యను ఇరాన్ తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా బదులు తీర్చుకొంటానని హెచ్చరించింది .ఖమేని మృతికి ఖచ్చితమైన సమాధానం చెప్పకుండా వదిలి పెట్టేదిలేదు అని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. ఖమేని మృతిపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) సంతాపం తెలిపింది. తమ సుప్రీం లీడర్ ఖమేని చంపిన వారికి కఠినమైన శిక్ష విధిస్తామని ప్రతీకార దాడులు ఏక్షణమైన జరుపుతామని హెచ్చరించింది .అమెరికా- ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేని కీలక సలహాదారు అలీ షంఖానీతో పాటు ఐఆర్ జిసీ చీఫ్ మహమ్మద్ పాక్ పౌర్ ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ద్రువీకరించింది.ఈ క్రమంలో ఐఆర్ జిసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ను నియమించింది మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వాహిదికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News