కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌కు కేవలం 7.5 మిలియన్ డోసులు మాత్రమే అమెరికా కేటాయించిందని భారత సంతతి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. ప్రపంచం నూతన, వ్యాక్సిన్ నిరోధక వైరస్ వేరియంట్ల ముప్పును ఎదుర్కొంటున్న సమయంలో గ్లోబల్ వ్యాక్సిన్ ఎయిడ్ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించడం ద్వారా మరిన్ని పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత బైడెన్ యంత్రాంగంపై ఉందని అన్నారు. కరోనా వైరస్‌పై పోరాటంతో భారత్‌తో కలిసి భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని, వ్యాక్సిన్లతో పాటు ఇతర సాయం చేయాలని భావిస్తున్నామని వైట్‌హౌస్ ప్రకటించిన మరుసటి రోజే రాజా కృష్ణమూర్తి ప్రకటన విడుదల చేశారు.
అమెరికా గ్లోబల్ వ్యాక్సిన్ ఎయిడ్ ప్రోగ్రామ్‌ను భారత్, ఇతర దేశాలకు విస్తరించేందుకు ఆయన చేస్తున్న కృషికి 116 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు ఉంది. భారత్ కోసం అమెరికా 7.5 మిలియన్ డోసులను మాత్రమే కేటాయించిందని చెప్పారు.