సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్, రోషన్, కృతికా శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 7 డేస్ 6 నైట్స్. హైదరాబాద్‌లో చిత్ర కొత్త ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ తక్కువ బడ్జెట్‌లో ఏదో సినిమా చేసేద్దాం అనుకోలేదు. ఓ కొత్త తరహా సినిమా తెరకెక్కించాలనే ప్రయత్నించాం. యువతరంతో పాటు మిగతా ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తారు అన్నారు. హీరో రోహన్ మాట్లాడుతూ నా స్నేహితులతో కలిసి సినిమా చూశా. వాళ్ళకు బాగా నచ్చింది అన్నారు.సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ఫస్ట్ కాపీ చూశాం. సంతృప్తికరంగా సినిమా వచ్చింది. సినిమాను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ పతాకాలపై రజనీకాంత్‌తో కలిసి సుమంత్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ కార్యక్రమంలో ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి, హీరో రోహన్, నిర్మాత రజనీకాంత్, నాయికలు మెహర్ చాహల్, కృతికా శెట్టి తదితరులు పాల్గొన్నారు.
