Namaste NRI

8 వసంతాలు సక్సెస్‌ మీట్‌

అనంతిక సనీల్‌కుమార్‌  లీడ్‌ రోల్‌ చేసిన సినిమా 8 వసంతాలు. ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో అనంతిక మాట్లాడారు. థియేటర్‌లో సినిమా చూసుకున్నప్పుడు గ్రేట్‌గా అనిపించింది. నా క్యారెక్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నది. కాంప్లిమెంట్స్‌ అయితే, ఇక లెక్కే లేదు. ముఖ్యంగా ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి అందరూ మాట్లాడుతున్నారు. నా వ్యక్తిగత జీవితానికి బాగా కనెక్టయిన పాత్ర ఇది. ఇంతమంచి పాత్రను నాతో చేయించిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టికీ, మైత్రీ మూవీమేకర్స్‌ వారికీ థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా  అని అన్నారు.

ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకుగాను దర్శకనిర్మాతలకు హీరోలు హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకా డీఓపీ విశ్వనాథరెడ్డి, నటీనటులు కన్నా, సంజన, కిరణ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News