గత ఐదేళ్లలో ఆరు లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడిరచింది. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడిరచారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం విదేశాల్లో సుమారు 1.33 కోట్లకు పైగా భారతీయులు నివసిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్సభలో తెలిపారు. 2017లో 1,33,049 మంది భారత పౌరసత్వాన్ని వదులుకోగా 2018లో 1,34,561, 2019లో 1,44,017, 2020లో 85,248 మంది, 2021 సెప్టెంబర్ నాటికి 1,11,287 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని లోక్సభలో అడిగిన ప్రశ్శకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అయితే విదేశాల్లో భారత సంతతి వారు తమ తమ రంగాల్లో విజయం కేతనం ఎగరేస్తున్నారు. ప్రస్తుతం అనేక అంతర్జాతీయ టెక్ కంపెనీలకు నేతృత్వం వహిస్తోంది భారతీయు లేదా భారతీయ సంతతికి చెందిన వారే. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్, అడోబీ, వీఎమ్వేర్, వంటి సంస్థలకు ఇండియన్లు నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.