అఫ్గానిస్థాన్‌లో మహిళలపై పలువిధాల ఆంక్షలు విధిస్తున్న తాలిబన్లు తాజాగా వారికి అనుకూలమైన కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మహిళలకు బలవంతంగా వివాహాలు చేయడాన్ని నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అఫ్గాన్‌లో తమ ప్రభుత్వాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో గుర్తింపజేసుకోవడంతో పాటు ఆయా దేశాల నుంచి మునుపటి విధంగా ఆర్థిక సాయాన్ని పొందే ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వ తీసుకున్న తాజా నిర్ణయం కనిపిస్తున్నదని విశేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాలిబన్లు జారీ చేసిన ఆదేశాల్లో వివాహానికి కనీస వయసును పేర్కొనలేదు. అంతకుముందు ఇది 16 ఏండ్లుగా ఉండేది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)