ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ 2022 జనవరి 6, 7,8 న భీమవరం వెస్ట్ బెర్రీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా తెలుగు భాషా వైభవానికి కృషి చేయడం అభినందనీయమని డా. గజల్ శ్రీనివాస్ అన్నారు. ఢల్లీిలోని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలసి ఆహ్వాన లేఖ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంబరాలు తెలుగు జాతికి ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ సంబరాల ముగింపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కిషన్ రెడ్డిని కలిసి ఆహ్వాహించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయ ప్రశాష్ వున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)