Skip to main content

Namaste NRI

అమ్మ చెప్పిన అందమైన ప్రేమకథ : మంగా శ్రీనివాస్‌

శ్రవణ్‌, మలైకా టి వాసుపల్‌ జంటగా నటించిన చిత్రం చకోర – లూనార్‌ లవ్‌ బర్డ్‌. మంగా శ్రీనివాస్‌ దర్శకుడు. చింతాడ హేమారావు నిర్మాత. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వైజాగ్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇదొక అమ్మ చెప్పిన ప్రేమకథ. కేవలం వర్షపునీళ్లతోనే దాహం తీర్చుకునే విశిష్టమైన పక్షి చకోర అని అన్నారు.

ఆ పక్షిలాగే మనం కూడా స్వచ్ఛమైన పేమ కోసమే వేచి చూడాలని, అలాగే.. చకోర పక్షికి జాబిల్లిని చేరాలని కోరిక. దాని కోసం అలుపెరగకుండా ప్రయాణిస్తుంది. ఆ ప్రయత్నంలోనే మరణిస్తుంది. మనం కూడా చకోర పక్షిలా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆవిశ్రాంతంగా శ్రమించాలని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం అని దర్శకుడు మంగా శ్రీనివాస్‌ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు శ్రవణ్‌, మలైకా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. అక్టోబర్‌ 9న సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events