శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటించిన చిత్రం చకోర – లూనార్ లవ్ బర్డ్. మంగా శ్రీనివాస్ దర్శకుడు. చింతాడ హేమారావు నిర్మాత. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ వైజాగ్లో జరిగింది. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇదొక అమ్మ చెప్పిన ప్రేమకథ. కేవలం వర్షపునీళ్లతోనే దాహం తీర్చుకునే విశిష్టమైన పక్షి చకోర అని అన్నారు.

ఆ పక్షిలాగే మనం కూడా స్వచ్ఛమైన పేమ కోసమే వేచి చూడాలని, అలాగే.. చకోర పక్షికి జాబిల్లిని చేరాలని కోరిక. దాని కోసం అలుపెరగకుండా ప్రయాణిస్తుంది. ఆ ప్రయత్నంలోనే మరణిస్తుంది. మనం కూడా చకోర పక్షిలా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆవిశ్రాంతంగా శ్రమించాలని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం అని దర్శకుడు మంగా శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు శ్రవణ్, మలైకా ఆనందం వెలిబుచ్చారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. అక్టోబర్ 9న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నది.















