ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అరంగ్రేటం చేయనుంది. అల్లూరు సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ గ్లింప్స్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. దీంతో పాటు మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఇటీవల మరో టీజర్‌ని రిలీజ్ చేయగా అది సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దుగా మార్చింది. సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. అలాగే రెండు పాటలు కూడా వచ్చాయి. ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ సోల్ ఆంథెమ్ ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.
డిసెంబర్ 9న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. ట్రైలర్ ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : కీరవాణి, మాటలు: సాయిమాధవ్, బుర్రా, ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్, నిర్మాత: డీవీవీ దానయ్య.