దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త రకం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు బోట్స్‌వానా, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల్లో ఈ కేసులు బయటపడగా తాజాగా ఆ జాబితాలో బ్రిటన్ చేరింది. ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 160 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలోనే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధించింది. బ్రిటన్‌కు వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసింది. నైజీరియా నుంచి వచ్చినవారి హోటళ్లకు తరలిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు.
ఒమిక్రాన్ వ్యాప్తిని నిలువరించడాని అంతర్జాతీయ ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచుతామని, ప్రయాణానికి ముందు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. నైజీరియా నుంచి వచ్చినవారు హోటళ్లలో క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తెలిపారు.